NDL: బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రం నుంచి మద్దిలేటి స్వామి క్షేత్రం వరకు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సీపీఐ నాయకుడు రంగం నాయుడు ఇవాళ ప్రభుత్వ అధికారులను కోరారు. రంగం నాయుడు మాట్లాడుతూ.. రోడ్ల వెంట ఉన్న కల్వర్టులు కూలిపోయిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు.