TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.465 కోట్లు కేటాయించినట్లు రేవంత్ వెల్లడించారు. గ్రామీణ క్రీడలకు ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.