SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివసిస్తున్న వారిని నేడు అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేరవేశారు. సిర్గాపూర్ SI మహేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా గత 2 రోజుల నుంచి వర్షానికి బాగా తడిచిన ఇంట్లో నివసిస్తున్న గొల్ల సాయవ్వను ఖాళీ చేయించి సామాన్లతో పాటు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.