VKB: జిల్లాలో కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి- తాండూరు రోడ్డు ప్రయాణానికి ప్రమాదకరంగా మారింది. మండల కేంద్రం నుంచి తాండూరు వెళ్లే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్ల గుంతలను పూడ్చి, ప్రయాణాన్ని సురక్షితం చేయాలని ఆర్&బీ అధికారులను కోరుతున్నారు.