VZM: PACSలను బలోపేతం చేసి రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారీ అన్నారు. గురువారం కొత్తవలసలో PACS అధ్యక్ష , డైరెక్టర్ల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ సహకారంతో లక్ష టన్నుల యూరియా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు.