ELR: ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట సమీపంలో ఇవాళ బైక్పై చిన్న వెంకన్న దర్శనానికి వెళ్తున్న అత్తిలికి చెందిన కె. వెంకట సుబ్బారావుపై చెట్టుకొమ్మ విరిగిపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.