NLR: కందుకూరు మున్సిపాలిటి అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేసేలా CM చంద్రబాబు అనుమతించారని MLA ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రూ. 3.25 కోట్లతో పట్టణంలో రోడ్ల విస్తరణ, డివైడర్, సెంటర్ లైటింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. పలువురు వ్యాపారులకు ఇబ్బంది కలిగినా పట్టణ సుందరీకరణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.