TG: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రోమ్ నగరం తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం అంటూ చురకలంటించాడు. ఓవైపు రాష్ట్ర వరదల్లో ఉంటే.. మూసీ సుందరీకరణ, ఒలంపిక్స్ గేమ్స్ అంటూ మీటింగుల్లో ఉన్నాడంటూ విమర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.