MDCL: గణేష్ ఉత్సవాల సందర్భంగా శామీర్ పేట పీఎస్లో డీజే ఆపరేటర్లు, సౌండ్ సిస్టం సరఫరాదారులతో సీఐ శ్రీనాథ్ గురువారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు డీజేలకు, సౌండ్ సిస్టంలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. గణేష్ ఉత్సవాల్లో డీజేలు, సౌండ్ సిస్టంలను వాడకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.