KNR: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. అలాగే జిల్లాలో సహాయక చర్యలు చేపట్టినందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. సమయానికి రెస్క్యూ టీమ్లను రంగంలోకి దింపి ప్రజలను కాపాడటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.