W.G: గత ఐదేళ్లలో తన వెన్నంటి తోడ్పాటు అందించిన నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని రాష్ట్ర భవన, కార్మిక బోర్డు ఛైర్మన్ వలవల బాజ్జీ భరోసానిచ్చారు. ఏపీబీవోసీ బోర్డు ఛైర్మన్గా ఇవాళ విజయవాడ కుంచనపల్లి శ్రీనివాస హాల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుభాష్, గొట్టిపాటి రవి, MLC రాజశేఖర్, మాజీ మంత్రి పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.