BHPL: రేగొండ మండలం లింగాలలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలను గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసి, స్టోర్ రూమ్లో కుళ్లిన టమాటాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిటికీలకు మెష్ డోర్లు, గ్రౌండ్లో నీటి నిల్వ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.