KDP: జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ గురువారం రాత్రి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు రూపొందించిన యాప్ ద్వారా నిర్వాహకులు 4,500 విగ్రహాలకు అనుమతులు తీసుకున్నారన్నారు. ఈనెల 29న 1600 గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారన్నారు. శాంతిభద్రతలకు అటంకం కలిగించకుండా, నిర్వహకులు సహకరించాలని ఆయన తెలిపారు.