NLR: జిల్లాలో అవసరమైన భూసేకరణను త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ల్యాండ్ ఎక్విజిషన్పై సంబంధిత అధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. నడికుడి – శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ వివరాలు తెలుసుకున్నారు. భూమిని ఇచ్చిన వారికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు.