NLG: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితాలో లోపాలను గుర్తించాలని బీఆర్ఎస్ శ్రేణులకు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ సూచించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు, గ్రామస్థాయిలో జాబితాను పరిశీలించాలని ఆయన కోరారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే ఆగస్టు 31లోగా అభ్యంతరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు.