ప్రకాశం: దొనకొండ మండలం బాధాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2,149 ఎకరాల భూములను ఇప్పటికే గుర్తించినట్లు జేసీ గోపాలకృష్ణ వెల్లడించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సాగుకు అవసరమైన స్థాయిలో యూరియా అందుబాటులో ఉంది అన్నారు.