GNTR: డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం గుంటూరులోని ఆంధ్రా క్రైస్తవ కళాశాలలో ప్రారంభమైంది. మొదటి రోజు 932 మందిని వెరిఫికేషన్‌కు పిలిచారు. ఉమ్మడి జిల్లాలో 1,650 పోస్టులకు గాను ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల వరకు 850 మందికి వెరిఫికేషన్ పూర్తయింది. మిగిలిన 718 మందికి శుక్రవారం పరిశీలన ఉండనుంది.