BDK: గణేష్ నవరాత్రుల సందర్భంగా, భద్రాచలంలోని గోదావరి నది వద్ద జరిగే నిమజ్జన వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా SP రోహిత్ రాజ్ తెలిపారు. ఈ ఏర్పాట్ల కోసం ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి నది కరకట్ట వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.