GNTR: మెగా డీఎస్సీ-2025 ధృవపత్రాల పరిశీలనకు వచ్చిన విభిన్న ప్రతిభావంతులు మెడికల్ బోర్డు పరీక్షకు హాజరు కావాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి C.V రేణుక తెలిపారు. ఈ నెల 29న శుక్రవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరీక్ష జరుగుతుందని ఆమె చెప్పారు. సామర్థ్య పరీక్ష నిమిత్తం ఒక్కో అభ్యర్థి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1,500 చెల్లించాలన్నారు.