MNCL: గోదావరి లోతట్టు ప్రాంతమైన జైపూర్ మండలం వేలాల గ్రామంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద ఉద్ధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్కు సూచించినట్లుగా చెప్పారు. శుక్రవారం ఉదయం లోతట్టు ప్రాంతాల్లో తాను పర్యటించనున్నట్లు మంత్రి వివరించారు.