NLR: జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా పోలీసులను ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షపై రివ్యూ నిర్వహించారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.