W.G: అనాకోడేరు, ఎల్.జి పాడు గ్రామాల్లో జరుగుతున్న ఫేజ్-3 ప్రభుత్వ భూముల రీ సర్వే ప్రక్రియను జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. రాహుల్ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డుల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా వీఆర్వోలు వెంటనే పూర్తి చేయాలని జేసీ సూచించారు.