W.G: గణేశ్ నిమజ్జన వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, పోలీసులు కృషి చేయాలని ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. నరసాపురంలో ఆయన మాట్లాడారు. ఊరేగింపులో కుల, మత, ప్రాంత లేదా రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు లేదా చర్యలు ఉండరాదని సూచించారు. నిమజ్జనం కేవలం భక్తిభావంతో మాత్రమే జరుపుకోవాలని ఆయన కోరారు.