ATP: కూడేరు మండల కేంద్రంలో పశు గ్రాసం కోసం ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న గడ్డి జొన్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి శ్రీనివాసులు గురువారం తెలిపారు. మండలానికి (కూడేరు, చోళసముద్రం ఆస్పత్రుల పరిధిలో) 4 టన్నుల గడ్డి జొన్న విత్తనాలు సరఫరా అయినట్లు తెలిపారు. సబ్సిడీతో కేజీ జొన్నలు రూ. 23తో గరిష్టంగా ఒక రైతుకు 20 కేజీలు వరకు ఇస్తామన్నారు.