కృష్ణా: మోపిదేవి మండల పరిధిలోని కే. కొత్తపాలెం గ్రామంలో తాపీ పని చేసుకుని నివాసం ఉంటున్న మత్తి రమేష్ (55) ఈ నెల 25వ తేదీ రాత్రి కేఈబీ కెనాల్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందినట్లు మోపిదేవి ఎస్సై సత్యనారాయణ తెలిపారు. గురువారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.