KNR: శంకరపట్నం మండలంలో గురువారం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో అర్కండ్ల వాగు ఉద్ధృతంగాగా ప్రవహిస్తోంది. దీంతో అరకండ్లకు వెళ్లే రహదారి తాత్కాలికంగా మూసివేశారు. వాహనదారులు, రైతులు ఈ మార్గం వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సంప్రదించాలని సబ్ ఇన్స్పెక్టర్ కె. శేఖర్ విజ్ఞప్తి చేశారు.