PDPL: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. గురువారం ఓదెల మండలం అబ్బిడిపల్లి, బాయమ్మపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అబ్బిడిపల్లికి రూ.10 లక్షలు, బయమ్మపల్లికి రూ.38 లక్షలు కేటాయించామన్నారు.