బీహార్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు బీహార్‌లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై.. హైఅలర్ట్ జారీ చేశారు. అనంతరం ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలను విడుదల చేశారు. నేపాల్ మీదుగా అరారియా ద్వారా చొరబడినట్లు DGP వినయ్ కుమార్ వెల్లడించారు. కాగా, బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.