AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త విధానాన్ని ప్రారంభించనున్నారు. గాజువాకకు చెందిన కార్యకర్త సురేష్ కుమార్ ఇచ్చిన సూచనకు స్పందించిన పవన్.. వారి కష్టాలు, పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ విధానం ప్రారంభిస్తానన్నారు. ఈసారి విశాఖ వచ్చినప్పుడు ముందుగా సురేష్ ఇంటికే వెళ్లి బస చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా కార్యకర్తలకు మరింత చేరువగా ఉండాలని జనసేనాని భావిస్తున్నారు.