W.G: సీపీఐ రాష్ట్ర సమితి సభ్యునిగా తణుకు చెందిన జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఎన్నికయ్యారు. ఇటీవల ఒంగోలులో మూడ్రోజులు పాటు జరిగిన సీపీఐ 28వ రాష్ట్ర మహాసభల్లో జిల్లా నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యునిగా తాను ఎన్నికైనట్టు భీమారావు చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్విరామంగా పోరాడాలని పార్టీ రాష్ట్ర మహాసభల్లో పిలుపునిచ్చారు.