HCA మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు హైకోర్టులో బెయిల్ లభించింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆయన రూ.1 లక్ష, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు పేర్కొంది. గత IPL సీజన్ సమయంలో టిక్కెట్ల కేటాయింపు, HCAలో జరిగిన అవకతవకలకు సంబంధించి సీఐడీ ఆయన్ని జూన్లో అరెస్ట్ చేసింది.