SKLM: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యుత్ బాదుడు తగ్గిస్తానని చెప్పి రూ. 15 వేల 485 కోట్లు అదనపు భారం ప్రజలపై మోపిందని CITU జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలనాయుడు విమర్శించారు. గురువారం బూర్జలోని తిమడాం గ్రామంలో విద్యుత్ అమరుల సంస్మరణ దినం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ట్రూఆఫ్ ఛార్జీలు మోపడం సరికాదన్నారు.