GNTR: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.05లక్షల క్యూసెక్కులుగా ఉందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే, పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఆయన ప్రజలను హెచ్చరించారు.