MNCL: హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇప్పటికే హైదారాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి గోలివాడ పంపు హౌజ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా చేరుతున్న వరదను పరిశీలిస్తారు.