KMR: జిల్లాని వరదలు ముంచెత్తడంతో KMR జిల్లాలోని విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు. KMR కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నెల 29, 30 తేదీల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.