అన్నమయ్య: జిల్లా రాయచోటిలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన 62 మంది అనారోగ్య బాధితులకు రూ.60.24 లక్షలు, మరో ఇద్దరు LOC బాధితులకు రూ.11 లక్షల చెక్కులను అందజేశారు.