GNTR: ఈవీఎంల భద్రత విషయంలో రాజీపడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు గురువారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీటీవీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఈ తనిఖీలో డీఆర్ఓ షేక్ ఖాజావలి కూడా పాల్గొన్నారు.