ASR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్ బర్దార్ గురువారం ప్రజలకు సూచించారు. అరకు, చింతూరు, సీలేరు, కొయ్యూరు, మంప, ముంచంగిపుట్టు, దేవీపట్నం, కూనవరం, వీఆర్ పురం ప్రాంతాల్లో పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయన్నారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు.