AP: సాహిత్య ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా సంస్థ మాజీ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 25న పూర్ణచంద్రరావును అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. వందలాది మంది గృహ కొనుగోలుదారులను మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 26న నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.