BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి నిత్య పూజల కోసం రంగారెడ్డి జిల్లాకు చెందిన భక్తుడు రూ.3,52,000 వేలు అందించారు. గురువారం భద్రాచలం ఆలయ ప్రాంగణంలో కుకట్ పల్లి వివేకానంద నగర్ కాలనీకి చెందిన కృష్ణారావు, కౌసల్య దంపతులు ఈ విరాళం ఆలయ ఈవోకు అందించారు. అనంతరం రామయ్యని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.