SRD: విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కారాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభ గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ పాల్గొన్నారు.