KDP: పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి వారి నూలు పూజా పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు కృష్ణరాజేష్ శర్మ ఎమ్మెల్సీకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి MLC రాంగోపాల్ రెడ్డి ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు.