VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.