KRNL:పెద్దకడబూరు మం. కల్లుకుంట గ్రామానికి చెందిన అట్రాసిటీ బాధితురాలు గోవిందమ్మ ఇవాళ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కుమారుడు కులాంతర వివాహం చేసుకున్న కారణంగా తనపై దాడి చేసి ఊరి నుంచి వెళ్లగొట్టారని తెలిపారు. అట్రాసిటీ బాధితులైన తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సదుపాయాలు తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు.