KMR: డోంగ్లీ మండలంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. గురువారం ఎస్సై విజయ్ కొండ సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధవారం అర్థరాత్రి నుంచి ఎస్సై విజయ్ కొండ, సిబ్బంది నిరంతరాయంగా ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డోంగ్లి మండలంలో ఓ వృద్ధురాలిని ఎస్సై ఎత్తుకుని తీసుకెళ్లారు.