SRCL: రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రాణ నష్గం, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బోయినపల్లి మండలంలోని మధ్య మానేరు రిజర్వాయర్ వద్ద మానేరు జలాలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు.