KMR: బిక్కనూర్ మండలం సిద్ధిరామేశ్వర నగర్ శివారులో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను రైల్వే ఐజీ రమేశ్ నాయుడు గురువారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది అక్కడ మరమ్మతులు చేపట్టారు. పనులను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్పీ చందనా దీప్తి పాల్గొన్నారు.