KMR: నిజాం సాగర్ ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేయడంతో పిట్లం మండలంలోని కుర్తి గ్రామం వద్ద హై లెవెల్ బ్రిడ్జీపై నీరు ప్రవహిస్తోంది. ప్రవాహం పెరుగుతుండడంతో గురువారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కుర్తి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అధికార యంత్రం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్య వేక్షిస్తున్నట్లు తెలిపారు.