BDK: దమ్మపేట మండలం నెమలి పేట గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి గ్రామం మొత్తం వరద ముంపుకు గురి అయింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు గురువారం పర్యటించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇప్పటివరకు అధికారులు స్పందించడం లేదని ఇళ్లలోకి వరద నీరు చేరి ఆహారం నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరారు.