MNCL: బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా హాజీపూర్ మండలానికి చెందిన ఎనగందుల క్రిష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ నియామక పత్రం జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.